SKLM: జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి (DVEO) ఆర్. సురేష్ కుమార్ను ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ (RIO)గా నియమిస్తూ బోర్డు కార్యదర్శి నారాయణ్ భరత్ గుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే రోజు సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆర్ ఐ ఓ (ఎఫ్ ఎస్సీ)గా ఉన్న పి. దుర్గారావు ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు.