TG: స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, త్యాగం మరువలేనిది అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు, గాంధేయవాది ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన కేసీఆర్ కొనియాడారు. బాపూజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు.