నటి మీనాక్షి చౌదరి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో రాబోతున్న ‘ఫోర్స్ 3’ సినిమాలో మీనాక్షి కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె లుక్ టెస్ట్ కూడా అయిపోయిందట. ఇక ఈ చిత్రాన్ని భావ్ ధులియా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.