SDPT: దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో శ్రీ రేణుకా మాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా దేవాలయంలో పనిచేసే కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్ మహేశ్ మాట్లాడుతూ.. ఎండనకా, వాననకా ఆలయాన్ని ప్రతిరోజు శుభ్రపరుస్తున్న కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ క్యాషియర్ కొండ్ర యాదగిరి తదితరులు పాల్గొన్నారు.