ADB: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఏజెన్సీ ప్రాంతాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు ఎన్నికల పోటీ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సందర్బంగా శనివారం ఉట్నూర్లో సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అధికారులతో కలిసి సర్పంచ్, వార్డుమెంబర్, ఎంపీటీసీ రిజర్వేషన్ కోసం లక్కీ డ్రా నిర్వహించారు.