‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’లో రాజమౌళి, అమీర్ ఖాన్ అతిథి పాత్రల్లో కనిపించడంపై నటి అన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సన్నివేశం ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదని, అప్పటికప్పుడు అనుకుని రాసినదని చెప్పారు. ముంబైలో ఓ స్టూడియోలో ఈ సిరీస్ షూటింగ్ జరుగుతుండగా.. వారిద్దరూ ఎదో పనిమీద అక్కడి వచ్చారన్నారు. దీంతో ఆర్యన్ 20 నిమిషాల్లో ఆ సన్నివేశం రాశారని పేర్కొన్నారు.