ATP: అనంతపురంలోని ఎన్జీవో హోంలో CPI ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు. బీసీ కులాల జనాభా ఆధారంగా స్థానిక సంస్థల్లో సీట్లు పెంచాలని, రాష్ట్రంలో తక్షణమే బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్రిటీష్ కాలంలో కూడా కుల గణన జరిగిందని, ఇప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం శోచనీయమని విమర్శించారు.