అన్నమయ్య: ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శనివారం పండుగల సమయంలో ఇంటి భద్రతకు సంబంధించి ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా తలుపులకు బలమైనతాళాలు వేయడం, బంగారం, నగదు, ముఖ్య పత్రాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచడం, ఇంటి ముందు, వెనుక సీసీటీవీ కెమెరాలు, అలారం, సెన్సార్ లైట్లు ఏర్పాటు చేసుకోవడం, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.