TG: ఏటీసీలో శిక్షణ పొందుతున్న పేదవారికి త్వరలో ప్రతినెలా రూ. 2000 స్కాలర్ షిప్ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేదపిల్లలకు ఖర్చులకు వస్తాయన్నారు. ఇది సంక్షేమ పథకం కాదని.. భవిష్యత్ పెట్టుబడి అని పేర్కొన్నారు. పేద పిల్లలు చదువుకుంటేనే.. జీవితాలు మారుతాయన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారొద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.