SS: సోమందేపల్లి మండలం పందిపర్తిలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. డీలర్ గౌరీ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులు ఎక్కడ నుండి అయినా స్మార్ట్ కార్డులు ఉపయోగించి రేషన్ తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ గంగాధర్, మాజీ MPTC మూర్తి, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసులు, ఆయకట్టు ఉప సర్పంచ్ రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు.