TG: నల్గొండలోని మదర్ డెయిరీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు మూడు డైరెక్టర్ స్థానాలను గెలుచుకున్నారు. మదర్ డెయిరీ డైరెక్టర్లుగా లక్ష్మీ నర్సింహా రెడ్డి, భాస్కర్ గౌడ్, కర్నాటి జయశ్రీ విజయం సాధించారని ఎన్నికల అధికారులు ప్రకటించారు.