ASF: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.శనివారం కలెక్టరేట్ లో ZPTC,MPTC ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో అధికారుల పాత్ర కీలకమని అన్నారు. అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని అధికారులు,సిబ్బంది సమన్వయంతో ముందకు సాగాలన్నారు.