SRD: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటీఐ సమీపంలో దివ్యాంగులకు ఉపకారణాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలను పంపిణీ చేసినట్లు చెప్పారు.