E.G: GST సంస్కరణల మూలంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేకూరే మేలును వివరించే విధంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని జేసీ, GST నోడల్ అధికారి వై.మేఘ స్వరూప్ తెలిపారు. శనివారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల రోజులపాటు సూపర్ GST – సూపర్ సేవింగ్స్ పేరిట ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.