TG: రాష్ట్రంలో BJP ఎంపీల్లో కొందరు ఓటు చోరీ వల్లే గెలిచారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ మరోసారి ఆరోపించారు. ‘జూబ్లీహిల్స్ పరిధిలోనూ ఓట్లలో అవకతవకలు జరిగాయి. ఈటల రాజేందర్‌కు మల్కాజిగిరిలో మూడు లక్షల మెజార్టీ వచ్చిందంటే దీంట్లో గోల్ మాల్ జరిగింది. రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే EC సరైన సమాధానం ఇవ్వకుండా.. BJPకి మద్దతు పలుకుతోంది‘ అని అన్నారు.