ATP: రాయదుర్గం మండలంలోని 58 చౌకధాన్యపు డిపోలకు కొత్త ఈ పాస్ మిషన్లను సరఫరా చేసినట్లు తహశీల్దార్ నాగరాజు తెలిపారు. శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో డీలర్ల వద్ద ఉన్న పాత ఈ పాస్ మిషన్లను అధికారులకు అప్పగించారు.ప్రభుత్వం నూతన సాంకేతికతో రూపొందించిన ఈ పాస్ మిషన్లను అధికారుల చేతుల మీదుగా అందుకున్నారు.