MDK: నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి తూప్రాన్ వైపు వెళ్లే ప్రధాన రహదారి భారీ గుంతలతో నిండిపోయిందని వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతినడంతో, ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ప్రజల ఇబ్బందులను తొలగించడానికి రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.