SRPT: మూసి నదిలో వరద ఉదృతి దృష్ట్యా జిల్లా ఎస్పీ నర్సింహా ఈరోజు సూర్యాపేట రూరల్ పరిధి ఎదురువారిగూడెం – బీమారం వంతెన వద్ద మూసి నది ప్రవాహాన్ని పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షాల దృష్ట్యా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మూసి ప్రాజెక్ట్ అధికారులతో సమన్వయంగా పని చేయాలని అన్నారు. డీఎస్పీ ప్రసన్నకుమార్ , ఎస్సై బాలు ఉన్నారు.