NLG: కనగల్ మండలం దర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు శ్రీ లలితా సుందరీ దేవిగా ఎరుపు రంగు వస్త్రంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి బెల్లం పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ఛైర్మన్ వెంకటరెడ్డి, అధికారి అంబటి నాగిరెడ్డి అర్చకులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.