అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్స్టైన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లలో ఇప్పటికే ట్రంప్ సహా బిల్గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారి పేర్లు ఉన్నాయి. తాజాగా ఇందులో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేరు కూడా ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే, దీనిపై స్పందించిన మస్క్.. అవన్నీ అవాస్తవాలంటూ పోస్ట్ చేశారు.