జూ. ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్ రాబోతుందని గతంలో మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్డేట్స్ రాలేదు. తాజాగా మేకర్స్ ‘దేవర తాండవానికి ఏడాది పూర్తయింది. దేవర 2 కోసం సిద్ధం కండి’ అని తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.