W.G: ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో, ఆకివీడు నగర పంచాయతీ అధికారులు ఇవాళ పలు షాపులపై దాడులు నిర్వహించారు. ఈ దాడులతో షాపుల్లో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. కవర్లు వినియోగిస్తే చర్యలు తప్పవని అధికారులు గట్టిగా హెచ్చరించారు. నగర పంచాయతీ ఏఈ నిమ్మల విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.