NLG: జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ఇవాళ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కలెక్టర్ త్రిపాఠి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కారుడు, సామాజిక న్యాయం కోసం తన జీవితాంతం కృషి చేసిన మహనీయుడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాలన అధికారి మోతీలాల్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.