KNR: శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి ఆలయంలో అమ్మవారు శ్రీ లలితా దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు వేకువ జాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారిని గాజుల అలంకరణలో అలంకరించి శ్రీ లలితా దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.