MBNR: సాయుధ పోరాటం నుంచి రాజకీయపోరాటం వరకు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ త్యాగస్పూర్తిని చాటారని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన జయంతి సందర్భంగా MBNRలో కలెక్టర్ విజయేంద్రబోయితో కలిసి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప యోధుడు బాపూజీ అని సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.