వరంగల్: MBBS సీట్ల భర్తీ రెండో దశ ప్రవేశాల కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల గడువును కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ నెల 29 వరకు పొడిగించింది. రెండో దశ వెబ్ ఆప్షన్ల గడువు ఈ నెల 27న 2 గంటలలోపు ముగియాల్సి ఉంది. ఇప్పటికే రెండో దశ వెబ్ ఆప్షన్లు ఇచ్చినవారు కావాలనుకుంటే మళ్లీ సవరించుకోవచ్చని, కొత్తగా ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.