ప్రకాశం: ఒంగోలులో ఇవాళ జిల్లా వైసీపీ లీగల్ సెల్ సభ్యులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఒంగోలులోని అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ర్యాలీలో పాల్గొన్న ఒంగోలు వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు హరిబాబు మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.