KRNL: జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. శుక్రవారం ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని మండలంలో 126.2 మి.మీ, పెద్దకడబూరు 76.4, కౌతళం 10.2, ఎమ్మిగనూరు 88.0, నందవరం 85.6, కోసిగి 50.2, గోనెగండ్ల 83.6, హోళగుంద 46.4, మంత్రాలయం 99.4 మి.మీ వర్షపాతం నమోదైంది. డివిజన్ వ్యాప్తంగా 722.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు ఇవాళ తెలిపారు.