ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఎనిమిది రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. నేడు, రేపు వారాంతపు సెలవులు, 30న దుర్గాష్టమి, అక్టోబర్ 1న మహర్నవమి, 2, 3న విజయదశమి, గాంధీ జయంతి, 4, 5న వారాంతం సెలవులు ప్రకటించినట్లు వివరించారు. తిరిగి 6వ తేదీ నుంచి మార్కెట్లో పంట క్రయ విక్రయాలు యథావిధిగా జరుగుతాయని చెప్పారు.