E.G: గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో రాజమండ్రి రూరల్ మండలం బోడి ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం రాత్రికి 9.70 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. దీంతో జల వనరుల శాఖ అధికారులు 5.37 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అలాగే తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 10,600 క్యూసెక్కుల జలాలను విడుదల చేశారు.