ADB: నార్నూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అప్రమత్తమయ్యారు. ఎడతెరిపి లేకుండా వాన పడుతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తతతో ఎప్పటికప్పుడు కరెంటును నిలిపివేస్తున్నారు. మరో 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయని HYD వాతావరణ శాఖ తెలిపింది.