SRPT: బకాయి పడ్డ గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ వేతనాలను చెల్లించాలని మల్టీపర్పస్ వర్కర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవ్వాళ జిల్లా అధికారులకు సమస్యలు పరిష్కరించాలని విన్నవించినట్లు తెలిపారు. మూడు మాసాలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు.