కరీంనగర్ చైతన్యపురిలో రాష్ట్ర మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ను కలుసుకున్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. మున్నూరుకాపులు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.