TG: MGBSను వరద నీరు ముంచెత్తడంతో.. బస్సులను అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులను దిల్సుఖ్నగర్ వరకే అనుమతించారు. మహబూబ్నగర్, కర్నూలు బస్సులను ఆరంఘార్ దగ్గర నిలిపివేస్తున్నారు. వరంగల్, హన్మకొండ బస్సులను ఉప్పల్ వద్ద ఆపేస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్ బస్సులను JBS వరకే అనుమతిస్తున్నారు.