TG: రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఏడో రోజు ‘వేపకాయ బతుకమ్మ’గా పిలుస్తారు. బియ్యపు పిండిని బాగా వేయించి వేపపండ్లలా తయారు చేసి అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. గుండె ఆరోగ్యానికి బియ్యపు పిండి చాలా మంచిది. ఇందులో సోడియం తక్కువగా ఉన్నందువల్ల రక్తపోటు సమస్యలు తక్కువ. బతుకమ్మ ఆడిన తర్వాత నైవేద్యం సమర్పించి ప్రసాదంగా పెడుతారు.