బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మరోసారి హాలీవుడ్లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె నటించిన హాలీవుడ్ మూవీ ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’కి సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం. ఇందులో దీపిక భాగం కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరగనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.