KRNL: నందవరం మండలంలోని నాగలదిన్నె జడ్పీ పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహితీవేత్త గద్వాల సోమన్న రచించిన 78వ పుస్తకం ‘ఊత కర్ర’ పుస్తకావిష్కరణ హైదరాబాద్లో ఇవాల ఘనంగా జరిగింది. గుఱ్ఱం జాషువా జయంత్యోత్సవం పురస్కరించుకొని సినీ, టీవీ గేయ రచయిత మల్లిక్, విశ్రాంత అటవీ శాఖ అధికారి కృష్ణారెడ్డి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ చేశారు.