WGL: నల్లబెల్లి మండలంలో శనివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి, పలువురు బీసీ సంఘాల నేతలు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమం, బీసీల హక్కుల సాధనకు చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు.