KNR: రూరల్ మండలం ఇరుకుల్ల, మొగ్గుంపూర్ గ్రామాల్లో శనివారం తెల్లవారుజామున నలుగురు యువకులు బైక్పై వచ్చి ఇళ్లలోకి చొరబడి సెల్ఫోన్లు దొంగిలించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దుండగులు వదిలి వెళ్లిన బైక్ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు.