KRNL: జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ నగరానికి వచ్చిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఎస్ భానుమతి, జస్టిస్ ఏ. హరినాథ శర్మను కలెక్టర్ ఏ. సిరి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ గెస్ట్ హౌస్లో వారికి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధితో కలిసి పలు అంశాలపై చర్చించారు. ప్రజలకు అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా చూడాలని న్యాయమూర్తులు తెలిపారు.