సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శనివారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తొలుత ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ప్రసాదం అందజేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.