NTR: ప్రతిరోజు వివిధ గ్రామాల నుంచి వందల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగించే కంచికచర్ల ఆర్టీసీ బస్టాండ్ మురికికూపంలా మారింది. లోతట్టు ప్రాంతం కావడంతో చిన్న వర్షంలోనే చెరువులా నీరు చేరుతోంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి, మురుగు, వాన నీటితో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ప్రయాణికులు నిలబడే పరిస్థితి లేక వాపోతున్నారు.