TG: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా జలాశయాలు నిండుకుండలా మారాయి. నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు 9 గేట్లను అధికారులు ఎత్తారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు, పులిచింతల ప్రాజెక్టు 11 గేట్లు, జూరాల ప్రాజెక్టు 39 గేట్లు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు 6 గేట్లు, ఎల్లంపల్లి ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.