TG: యాదాద్రి జిల్లాలో మూసి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జూలూరు-రుద్రవెల్లి దగ్గర మూసీ ఉగ్రరూపం దాల్చింది. బ్రిడ్జి పైనుంచి వరదనీరు వెళ్తోంది. దీంతో పోచంపల్లి-బీబీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వా దగ్గర లోలెవల్ వంతెన పైనుంచి మూసీ ప్రవహిస్తోంది. ఈ క్రమంలో చౌటుప్పల్-భవనగరి మధ్య రాకపోకలు ఆగిపోయాయి.