KRNL: కోసిగి మండలంలోని కామన్ దొడ్డి, దుద్ది, కోసిగి గ్రామాలలో భారీ వర్షాలకు నీట మునిగిన పత్తి పంట పొలాలను ఇవాళ ఏవో వరప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి పంట పోలాల్లో నిల్వ ఉన్న వర్షపు బయటకు వెళ్లేందుకు కాలువలు ఏర్పాటు చేయాలన్నారు. మొక్కల వేర్ల దగ్గర ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు.