NLG: అన్నారెడ్డిగూడెంకు సంబంధించిన లబ్ధిదారులకు నేడు మధ్యాహ్నం 12:30 గంటలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు అందజేయనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. NLGలోని అశోక్ గార్డెన్లో మంత్రి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం తేలకంటిగూడెంలో జరిగే ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని ఆమె తెలిపారు.