VSP: బోని సబ్ స్టేషన్ శిర్లపాలెం ఫీడర్ నిర్వహణ పనులు కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ జగన్మోహన రావు తెలిపారు. ఈ మేరకు అనంతవరం, గంధవరం, కొవ్వాడ, తిమ్మాపురం గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. కావున వినియోగదారులు, వ్యాపారస్థులు సహకరించాలని కోరారు.