W.G: రైతులు బీచ్ అభివృద్ధికి సహకరించాలని నర్సాపురం ఆర్డీవో కే. దాసిరాజు అన్నారు. కేపీ పాలెం సౌత్ గ్రామం శ్రీ రుక్మిణి సమేత పాండురంగ ఆలయంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ అందే వెంకటలక్ష్మి ముక్తేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టూరిజం శాఖ అధికారులు అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీ.ఆర్.జెడ్ పరిధిలో తగిన కృషి చేస్తున్నట్టు తెలిపారు.