NLG: జిల్లాలో ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న ఐదుగురుకి కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పట్టీలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని అన్నారు.