గాజా యుద్ధాన్ని త్వరలోనే ముగించి, బందీలను తిరిగి వెనక్కి తీసుకువస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం త్వరలోనే పూర్తి కానుందని వెల్లడించారు. ఇది యుద్ధాన్ని ముగించే ఒప్పందం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఒప్పందం పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.